అయోధ్య బాల రాముని విగ్రహ ప్రతిష్టకు ఏడాది..! 4 h ago
అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగి ఏడాది పూర్తవుతున్న వేళ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ట వైభోగంగా జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేందుకు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి మూడు రోజులపాటు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీనిలో సంగీత విభావరి ప్రత్యేకంగా ఉండబోతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.